'వకీల్ సాబ్' రిజల్ట్ పై 'ఐకాన్' ఆధారపడి ఉందా?

  • కొంతకాలం క్రితం అనౌన్స్ చేసిన 'ఐకాన్'
  • ఆదిలోనే ఆగిపోయిన ప్రాజెక్టు
  • వేణు శ్రీరామ్ కి హిట్ పడితే 'ఐకాన్' ఉన్నట్టే
అల్లు అర్జున్ కథానాయకుడిగా ఆ మధ్య 'ఐకాన్' సినిమాను అనౌన్స్ చేశారు. 'దిల్' రాజు నిర్మాణంలో వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందనున్నట్టు చెప్పారు. టైటిల్ అదిరిందంటూ బన్నీ ఫ్యాన్స్ అప్పట్లో ఫుల్ ఖుషీ అయ్యారు.

కానీ ఆ తరువాత అల్లు అర్జున్ ఈ ప్రాజెక్టును పక్కన పెట్టేసి, త్రివిక్రమ్ కోసం వెయిట్ చేసి మరీ 'అల వైకుంఠపురములో' ప్రాజెక్టుపైకి వెళ్లిపోయాడు. ఆ సినిమా హిట్ అయిన తరువాత ఆయన 'ఐకాన్' చేసే అవకాశాలు ఉన్నాయని అభిమానులు భావించారు. కానీ ఆయన 'ఐకాన్' ఊసెత్తకుండా  సుకుమార్ దర్శకత్వంలో 'పుష్ప' సినిమా చేస్తున్నాడు.

ఈ లోగా వేణు శ్రీరామ్ మరో ప్రాజెక్టును సెట్ చేసుకోవడానికి చాలా సమయమే పట్టింది. మళ్లీ 'దిల్' రాజునే ఆయనకి 'వకీల్ సాబ్' చేసే అవకాశం ఇచ్చాడు. ఈ నెల 9వ తేదీన ఈ సినిమా థియేటర్లకు రానుంది. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో, దర్శకుడు వేణు శ్రీరామ్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్నాడు.

ఈ సందర్భంగా 'ఐకాన్' పరిస్థితి ఏమిటనే ప్రశ్న ఆయనకి ఓ ఇంటర్వ్యూలో ఎదురైంది. ఆ ప్రాజెక్టు గురించి ప్రస్తుతం ఏమీ చెప్పలేననీ, 'వకీల్ సాబ్' రిలీజ్ తరువాత తన తదుపరి ప్రాజెక్టుపై ఒక క్లారిటీ వస్తుందని అన్నాడు. 'వకీల్ సాబ్' హిట్ కొడితే బన్నీ నుంచి పిలుపు రావొచ్చనే టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. 'వకీల్ సాబ్' రిజల్ట్ పైనే 'ఐకాన్' ఆధారపడి ఉందని చెప్పుకుంటున్నారు.


More Telugu News