దిల్ రాజు సోదరుడి తనయుడు హీరోగా రౌడీ బాయ్స్... మోషన్ పోస్టర్ విడుదల

  • సినీ రంగంలో మరో వారసుడి తెరంగేట్రం
  • శిరీష్ తనయుడు ఆశిష్ హీరోగా చిత్రం
  • హర్ష కొనుగంటి దర్శకత్వంలో రౌడీ బాయ్స్
  • ఆశిష్ సరసన అనుపమ పరమేశ్వరన్
  • దేవిశ్రీ ప్రసాద్ సంగీతం.. జూన్ 25న రిలీజ్
సినీ ఇండస్ట్రీలో వారసత్వం కొత్త కాదు. మొదటి నుంచీ ఎంతోమంది వారసులు ఇక్కడ ప్రవేశించి రాణించారు. ఇదే కోవలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు సోదరుడు శిరీష్ తనయుడు ఆశిష్ హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. యూత్ పుల్ ఎంటర్టయినర్ గా తెరకెక్కుతున్న 'రౌడీ బాయ్స్' అనే చిత్రంతో ఆశిష్ వెండితెరకు పరిచయం అవుతున్నాడు. ఈ చిత్రం జూన్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా రౌడీ బాయ్స్ మోషన్ పోస్టర్ ను చిత్రబృందం పంచుకుంది.

యూత్ ను ఉద్దేశించి సాగే హుషారైన ఓ పాట నేపథ్యంలో మోషన్ పోస్టర్ ఆకట్టుకునేలా ఉంది. ఈ సినిమాలో ఆశిష్ సరసన అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. హర్ష కొనుగంటి దర్శకత్వంలో బెక్కం వేణుగోపాల్ నిర్మాతగా ఈ రౌడీ బాయ్స్ చిత్రం రూపుదిద్దుకుంటోంది.


More Telugu News