చత్తీస్ గఢ్ లో మరో ఎన్ కౌంటర్... ఒక మావోయిస్టు మృతి

  • బిజాపూర్ వద్ద ఘటన
  • ప్రాజెక్టు పనులను అడ్డుకున్న మావోయిస్టులు
  • పలు వాహనాలకు నిప్పు
  • ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు
  • ఇరువర్గాల మధ్య కాల్పులు
  • సమీప అడవుల్లో కూంబింగ్
ఇటీవలే చత్తీస్ గఢ్ లో చోటుచేసుకున్న భారీ ఎన్ కౌంటర్ లో భద్రతా బలగాలకు భారీ ప్రాణనష్టం జరిగింది. ఆ ఘటన మరువకముందే చత్తీస్ గఢ్ లోని దంతెవాడలో మరోసారి కాల్పులు జరిగాయి. పోలీసుల కాల్పుల్లో ఓ మావోయిస్టు మృతి చెందాడు. బిజాపూర్ లో జరుగుతున్న ప్రాజెక్టు పనులను మావోయిస్టులు అడ్డుకున్నారు. నది వద్ద నిర్మస్తున్న వాటర్ ఫిల్టర్ ప్లాంట్ పనులపై అభ్యంతరం వ్యక్తం చేశారు. అక్కడున్న పలు వాహనాలకు వారు నిప్పు పెట్టారు.

దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకోవడంతో ఇరువర్గాల మధ్య కాల్పులు జరిగాయి. ఒక మావోయిస్టు మృతి చెందగా, మిగిలిన వారి కోసం కూంబింగ్ చేపట్టారు. అదనపు బలగాలు కూడా అక్కడికి చేరుకోవడంతో సమీపంలోని అడవులను జల్లెడ పడుతున్నారు.

కాగా, మరణించిన మావోయిస్టును మిలీషియా కమాండ్ కు చెందిన వెట్టి హుంగా అని భావిస్తున్నారు. వెట్టి హుంగా తలపై రూ.1 లక్ష రివార్డు ఉన్నట్టు తెలుస్తోంది.


More Telugu News