12 నెలల్లోపు మా వ్యాక్సిన్ మూడవ డోస్ తీసుకోవాలి: ఫైజర్
- ఆరు నుంచి ఏడాది లోపు మూడవ డోస్
- వాక్సిన్ సీక్వెన్స్ ను పరిశీలించాల్సి వుంది
- ఫైజర్ సీఈఓ ఆల్బర్ట్ బౌరులా
కరోనాను నివారించేలా తామందిస్తున్న టీకాను రెండు డోస్ లు తీసుకున్న తరువాత ఆరు నుంచి 12 నెలల వ్యవధిలో మూడవ డోస్ ను తీసుకుంటేనే పూర్తి ఫలితాలు ఉంటాయని ఫైజర్ సీఈఓ ఆల్బర్ట్ బౌరులా వ్యాఖ్యానించారు. ఇక ఈ వ్యాక్సిన్ సీక్వెన్స్ ను మరింత లోతుగా పరిశీలించాల్సి వుందని సీఎన్బీసీకి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన వ్యాఖ్యానించారు.
'మూడవ డోస్ అవసరమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. దీన్ని రెండు డోస్ లు తీసుకున్న తరువాత ఆరు నుంచి 12 నెలల లోపు తీసుకోవాలి. ఆపై వార్షిక రీ వ్యాక్సినేషన్ కూడా ఉండాలని అనుకుంటున్నాము. ఈ విషయాలపై మరింత స్పష్టత రావాల్సి వుంది. కరోనా వైరస్ సోకే ప్రమాదం అధికంగా ఉండేవారిని గుర్తించి, వారిని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతో ముఖ్యమని ఆయన అభిప్రాయపడ్డారు.
ప్రస్తుతానికి ప్రజలకు అందిస్తున్న వ్యాక్సిన్ ఎంత కాలం మేరకు ప్రభావం చూపుతుందన్న విషయాన్ని రీసెర్చర్లు ఇంకా తేల్చలేదని అన్నారు. కాగా, ఫైజర్ వ్యాక్సిన్ కరోనాను 91 శాతం వరకూ ఎదుర్కొంటోందని ఇటీవలి అధ్యయనం వెల్లడించిన సంగతి తెలిసిందే. అదే రెండో డోస్ తీసుకున్న తరువాత కనీసం ఆరు నెలల పాటు యాంటీ బాడీలు శరీరంలో ఉంటాయని కూడా తేల్చింది. ఈ విషయంలో మరింత డేటాను క్రోఢీకరించి, తుది ఫలితాలను వెల్లడించాల్సి వుందని యూఎస్ కొవిడ్-19 రెస్పామన్స్ టీమ్ హెడ్ డేవిడ్ కెస్లర్ వ్యాఖ్యానించారు. అమెరికన్లకు బూస్టర్ డోస్ లను సైతం అందిస్తామన్నారు.
ప్రస్తుతానికి ఈ విషయంలో ఎటువంటి తుది నిర్ణయానికీ రాలేదని, వ్యాక్సిన్ తీసుకున్న వారిలో యాంటీ బాడీల పెరుగుదల, అవి ఎంతకాలం ఉంటాయన్న విషయమై దేశంలోని పలు ప్రాంతాల్లో రీసెర్చ్ జరుగుతోందని ఆయన అన్నారు.