సీఎం కేసీఆర్ కోలుకోవాలంటూ టాలీవుడ్ ప్రముఖుల సందేశాలు

  • సీఎం కేసీఆర్ కు కరోనా పాజిటివ్
  • ఫాంహౌస్ లో ఐసోలేషన్
  • డాక్టర్ల పర్యవేక్షణలో చికిత్స
  • త్వరగా కోలుకోవాలన్న చిరంజీవి
  • భగవంతుడ్ని ప్రార్థిస్తున్నట్టు మహేశ్ ట్వీట్
తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు కరోనా వైరస్ ప్రభావం నుంచి త్వరగా కోలుకోవాలంటూ టాలీవుడ్ సినీ ప్రముఖులు ఆకాంక్షిస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి ట్విట్టర్ లో స్పందిస్తూ, కేసీఆర్ ఆరోగ్యం సంతరించుకోవాలని ఆ భగవంతుడ్ని ప్రార్థిస్తున్నానని పేర్కొన్నారు. సూపర్ స్టార్ మహేశ్ బాబు, ప్రముఖ నటి, బీజేపీ నేత విజయశాంతి, హారిక అండ్ హాసిని క్రియేషన్స్, దిల్ రాజుకు చెందిన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ నుంచి ఇదే విధమైన సందేశాలు వెలువడ్డాయి. మీరు త్వరగా కోలుకోవాలన్నదే మా ఆకాంక్ష అని పేర్కొన్నారు.

అటు, తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ సీఎం కేసీఆర్ ఆరోగ్యంపై స్పందించారు. సీఎం కేసీఆర్ కు కరోనాకు సంబంధించి అతి తక్కువ స్థాయిలోనే లక్షణాలు ఉన్నాయని వెల్లడించారు. డాక్టర్ల బృందం ఎప్పటికప్పుడు పరీక్షలు నిర్వహిస్తూ ఆయన ఆరోగ్య స్థితిని అంచనా వేస్తోందని తెలిపారు.


More Telugu News