ఏపీలో కరోనా బీభత్సం... భారత్ బయోటెక్, హెటెరో ఎండీలకు సీఎం జగన్ ఫోన్ 

  • రాష్ట్రంలో భారీగా కొత్త కేసులు, మరణాలు
  • రెమ్ డెసివిర్ ఔషధానికి పెరుగుతున్న డిమాండ్
  • వ్యాక్సిన్లకు సైతం డిమాండ్
  • రాష్ట్రానికి కొవాగ్జిన్ డోసులు, రెమ్ డెసివిర్ ఔషధాలు పంపాలన్న సీఎం
ఏపీలో కరోనా మహమ్మారి వేగంగా వ్యాపిస్తూ, అటు ప్రజలను, ఇటు ప్రభుత్వాన్ని తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. పాజిటివ్ కేసులు భారీగా నమోదవుతుండడంతో పాటు, మరణాల సంఖ్య కూడా అంతకంతకు అధికమవుతోంది. దాంతో కరోనా వ్యాక్సిన్ కు, చికిత్సలో ఉపయోగించే యాంటీ వైరల్ డ్రగ్ రెమ్ డెసివిర్ కు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది.

ఈ నేపథ్యంలో, సీఎం జగన్ అప్రమత్తం అయ్యారు. భారత్ బయోటెక్ ఎండీ కృష్ణ ఎల్లా, హెటెరో డ్రగ్స్ ఫార్మా అధినేత పార్థసారథి రెడ్డిలతో ఫోన్ లో మాట్లాడారు. ఏపీకి కొవాగ్జిన్ టీకా డోసులను పెద్ద సంఖ్యలో అందించాలని కృష్ణ ఎల్లాను కోరారు. రెమ్ డెసివిర్ ఇంజెక్షన్ వయల్స్ ను భారీ సంఖ్యలో రాష్ట్రానికి పంపాలని పార్థసారథి రెడ్డికి విజ్ఞప్తి చేశారు.


More Telugu News