నేడు ఐపీఎల్ లో అసలు మజా... తలపడనున్న ధోనీ, కోహ్లీ సేనలు!

  • నేటి మధ్యాహ్నం మ్యాచ్
  • మెగా క్లాష్ అంటున్న అభిమానులు
  • రెండో మ్యాచ్ డీసీ, ఎస్ ఆర్ హెచ్ మధ్య
ఒకరు భారత్ కు వరల్డ్ కప్ సహా ఎన్నో ఐసీసీ ట్రోఫీలను అందించిన మహేంద్ర సింగ్ ధోనీ. మరొకరు  భారత క్రికెట్ టీమ్ ను వరుస గెలుపుల బాట పట్టించి, అనూహ్య విజయాలను సాధించిన విరాట్ కోహ్లీ. వీరిద్దరి నేతృత్వంలోని చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు, నేడు ఐపీఎల్ పోటీల్లో తలపడనున్నాయి. దీంతో ఈ మ్యాచ్ అత్యంత మజాను కలిగిస్తుందని అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. నేటి మధ్యాహ్నం ఈ మ్యాచ్ సాగనుంది. ఈ మెగా క్లాష్ పై అభిమానుల్లో ఎన్నో అంచనాలున్నాయి.

ఇప్పటివరకూ ఐపీఎల్ లో ఒక్క పరాజయాన్ని కూడా నమోదు చేయని ఆర్సీబీ ఫేవరెట్ గా బరిలోకి దిగుతుంటే, మరో విజయాన్ని నమోదు చేసి, పాయింట్ల పట్టికలో ముందుకు వెళ్లాలన్న ఆకాంక్షతో ధోనీ సేన ఈ మ్యాచ్ ని ఆడనుంది. అనుకున్నట్టుగానే, ఈ పోటీపై సోషల్ మీడియాలో ధోనీ, విరాట్ అభిమానులు రెండు వర్గాలుగా చీలిపోయి, తమతమ జట్ల విజయం కోసం కామెంట్లు పెడుతున్నాయి.

ఈ మ్యాచ్ లో ధోనీ ఎటువంటి వ్యూహాలను అనుమతిస్తాడు? కోహ్లీ వాటిని ఎలా ఎదుర్కొంటాడన్న చర్చ సాగుతోంది. వాస్తవానికి ఐపీఎల్ లో ఆర్సీబీపై చెన్నై జట్టుకు మంచి రికార్డే ఉంది. అయితే, ఇంతవరకూ ఒక్కమారు కూడా కప్ ను అందుకోని బెంగళూరు టీమ్, ఈ సంవత్సరం ఎన్నో ఆశలు పెట్టుకుంది. అందుకు తగ్గట్టుగానే ఆర్సీబీ ఆటగాళ్లు సమష్ఠిగా రాణిస్తున్నారు. ఓపెనర్ దీపక్ పడిక్కల్ పై ఆర్సీబీ చాలా ఆశలు పెట్టుకుంది. అతను రాణిస్తే, దాదాపు సగం విజయం సాధించినట్టేనని ఫ్యాన్స్ అంటున్నారు.

ఇక, ఈ రోజు రాత్రి ఢిల్లీ కాపిటల్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ మధ్య మరో మ్యాచ్ సాగనుంది. ఇది కూడా అభిమానులను అలరిస్తుందనడంలో సందేహం లేదు.



More Telugu News