మీ అధికారులపై మర్డర్ కేసులు కూడా నమోదు చేస్తాం: కేంద్ర ఎన్నికల సంఘంపై మద్రాస్ హైకోర్టు ఆగ్రహం
- కరోనా కల్లోల సమయంలో ఎన్నికల ర్యాలీలకు ఎలా అనుమతిస్తారు?
- కోవిడ్ నిబంధనలను అమలు చేయడంలో మీరు విఫలమయ్యారు
- ఎన్నికల కౌంటింగ్ ను కూడా ఆపేస్తాం
కేంద్ర ఎన్నికల సంఘం బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తోందని మద్రాస్ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కరోనా సమయంలో ఎన్నికల ర్యాలీలకు అనుమతిని ఇవ్వడంపై మండిపడింది. కరోనా సెకండ్ వేవ్ దేశ వ్యాప్తంగా అల్లకల్లోలం సృష్టిస్తున్న తరుణంలో ఇలా ఎలా వ్యవహరిస్తారని ప్రశ్నించింది.
కరోనా నిబంధనలను అమలు చేయడంలో సీఈసీ పూర్తిగా విఫలమైందని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మండిపడ్డారు. ఎన్నికల ప్రచార సమయంలో ఎన్నికల అధికారులు వేరే గ్రహంలో ఉన్నారా? అని మండిపడ్డారు. కరోనాకు సంబంధించి మే 2వ తేదీకల్లా బ్లూ ప్రింట్ ను తయారు చేయాలని... లేకపోతే కౌంటింగ్ ను ఆపేయాలని ఆదేశిస్తామని వ్యాఖ్యానించారు. కరోనా వ్యాప్తికి ఎన్నికల సంఘం మాత్రమే బాధ్యురాలని అన్నారు. మీ అధికారులను హత్య కేసు కింద బుక్ చేస్తామని హెచ్చరించారు.
ప్రజల ఆరోగ్యమే తమకు అన్నిటి కంటే ఎక్కువని హైకోర్టు వ్యాఖ్యానించింది. మీరు బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారనే విషయాన్ని గుర్తు చేస్తున్నామని చెప్పింది. ఒక వ్యక్తి ప్రాణాలతో జీవించినప్పుడే... ఆ వ్యక్తి ప్రజాస్వామ్య హక్కులను అనుభవిస్తున్నట్టని తెలిపింది.