విజయవాడలో విషాదం.. రక్తపుమడుగులో తల్లి, ఇద్దరు పిల్లలు

  • వాంబే కాలనీలో డి బ్లాక్‌లో ఘటన
  • మహిళ భర్తపై అనుమానం వ్యక్తం చేస్తున్న స్థానికులు
  • దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామన్న పోలీసులు
విజయవాడలోని వాంబే కాలనీలో తల్లి, ఇద్దరు పిల్లలు రక్తపు మడుగులో పడి ఉన్న ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఇక్కడి డి బ్లాక్‌లో నివసిస్తున్న తల్లి, ఇద్దరు పిల్లలు అనుమానాస్పద స్థితిలో మరణించి ఉండడాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.

వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఈ మరణాలకు మహిళ భర్తే కారణమని స్థానికులు ఆరోపిస్తున్నారు. దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.


More Telugu News