పదో తరగతి పరీక్షలపై ఏపీ ప్రభుత్వం కీలక సూచనలు

  • విద్యార్థుల సందేహాలను నివృత్తి చేయాలని అధ్యాపకులకు ఆదేశం
  • జూన్ 1 నుంచి 5 వరకు పాఠశాలల్లో రిపోర్టు చేయాలని సూచన
  • పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు చేయాలని ఆదేశం
విద్యార్థులకు పరీక్షలను నిర్వహించేందుకు ఏపీ ప్రభుత్వం సిద్ధమవుతోంది. పరీక్షలను జరుపుతామంటూ ముఖ్యమంత్రి జగన్ కూడా స్పష్టతనిచ్చిన సంగతి తెలిసిందే. తాజగా ఏపీ ప్రభుత్వం కీలక ఆదేశాలను జారీ చేసింది. పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ఆన్ లైన్ ద్వారా సందేహాలను నివృత్తి చేయాలని అధ్యాపకులను విద్యాశాఖ ఆదేశించింది.

జూన్ లో జరిగే పదో తరగతి పరీక్షల నిర్వహణకు సిద్ధం కావాలని అధ్యాపకులను ఆదేశించింది. జూన్ 1వ తేదీ నుంచి 5 వరకు పాఠశాలల్లో రిపోర్టు చేయాలని సూచించింది. పరీక్షల నిర్వహణ, విద్యార్థుల సందేహాల నివృత్తి కోసం తగిన ఏర్పాట్లు చేయాలని ప్రాంతీయ డైరెక్టర్లను ఆదేశించింది. మే 1 నుంచి 31వ తేదీ వరకు పదో తరగతి విద్యార్థులకు సెలవులు ప్రకటించిన సంగతి తెలిసిందే.


More Telugu News