మాజీ మంత్రి దేవినేని ఉమకు మళ్లీ నోటీసులు పంపిన సీఐడీ అధికారులు
- టీడీపీ సీనియర్ నేతపై సీఐడీ కేసు
- సీఎంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారని ఆరోపణ
- వీడియో మార్ఫింగ్ చేశారని అభియోగం
- నిన్న 9 గంటల పాటు విచారణ
- మే 1న మళ్లీ విచారణకు రావాలంటూ నోటీసులు
టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమపై సీఐడీ అధికారులు కేసు నమోదు చేయడం తెలిసిందే. ఈ కేసు విచారణలో భాగంగా దేవినేని ఉమను నిన్న సీఐడీ అధికారులు 9 గంటల పాటు విచారించారు. ఏప్రిల్ 7వ తేదీన ఓ మీడియా సమావేశంలో సీఎం జగన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారని, అంతేకాకుండా వీడియో మార్ఫింగ్ చేశారన్న ఆరోపణలపై ఆయనను సీఐడీ అధికారులు మంగళగిరిలోని తమ కార్యాలయంలో సుదీర్ఘసమయం పాటు విచారించారు.
కాగా, దేవినేని ఉమకు సీఐడీ అధికారులు మరోసారి నోటీసులు పంపారు. మే 1న ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని ఆదేశించారు. నిన్న ఉమ ఇచ్చిన సమాధానాలతో సీఐడీ అధికారులు సంతృప్తి చెందకపోవడంతోనే తాజా నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తోంది.