మమతా బెనర్జీ విజయం అద్వితీయం: రాహుల్ గాంధీ

  • మమతాజీకి నా అభినందనలు
  • బెంగాలీలు బీజేపీని ఘోరంగా ఓడించారు
  • ప్రజల తీర్పును కాంగ్రెస్ గౌరవిస్తుందన్న రాహుల్
పశ్చిమ బెంగాల్ కు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ అద్వితీయమైన విజయాన్ని సాధించారని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. "మమతాజీని అభినందించడం నాకు ఆనందకరం. పశ్చిమ బెంగాల్ ప్రజలు బీజేపీని ఘోరంగా ఓడించారు" అని ఆయన అన్నారు.

అంతకుముందు "బెంగాల్ లో ప్రజల తీర్పును తాను గౌరవిస్తున్నానని, మా పార్టీ కార్యకర్తలు, క్షేత్ర స్థాయిలో మద్దతిచ్చిన లక్షలాది మంది ప్రజలకు రుణపడి వుంటాం. ప్రజల సమస్యలు తీర్చేందుకు, పార్టీ విలువలను కాపాడుకునేందుకు శ్రమిస్తాం. జై హింద్" అని తన ట్విట్టర్ ఖాతాలో వెల్లడించారు.

మమతా బెనర్జీ విజయంపై స్పందించిన బీజేపీ జాతీయ కార్యదర్శి కైలాశ్ వర్గియా, తమ పార్టీ ఓటమిని అంగీకరించారు. "కేవలం మమతా బెనర్జీ కారణంగానే టీఎంసీ గెలిచింది. బెంగాలీలు దీదీయే కావాలని కోరుకున్నారు. తప్పు ఎక్కడ జరిగిందో సమీక్షించుకుంటాం. సంస్థాగతంగా లోతుగా చర్చిస్తాం" అని అన్నారు.


More Telugu News