దేశంలో వరుసగా నాలుగో రోజు పెరిగిన పెట్రోలు, డీజిల్ ధ‌ర‌లు

  • లీట‌రు పెట్రోల్‌పై 28 పైసలు పెంపు
  • డీజిల్‌పై 31 పైసలు పెరుగుదల 
  • హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.94.68
  • లీటర్‌ డీజిల్‌ ధర రూ.89.11
దేశంలో వరుసగా నాలుగో రోజు కూడా పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరిగాయి. ఈ రోజు లీట‌రు పెట్రోల్‌పై 28 పైసలు, డీజిల్‌పై 31 పైసలు పెంచిన‌ట్లు ప్రభుత్వ రంగ చమురు సంస్థలు తెలిపాయి. ఢిల్లీలో నిన్న లీట‌రు పెట్రోల్‌ ధర రూ.90.99 ఉండగా, ఈ రోజు రూ.91.27కు చేరింది. ఇక లీట‌రు డీజిల్‌ ధర నిన్న‌ రూ.81.42 ఉండగా, ఈ రోజు రూ.81.73కి  పెరిగింది.

అలాగే, హైద‌రాబాద్‌లో లీట‌రు పెట్రోలు ధ‌ర నిన్న రూ.94.57గా ఉండ‌గా, డీజిల్ ధ‌ర  రూ.88.77గా ఉన్న విషయం తెలిసిందే. ఈ రోజు  హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.94.68, లీటర్‌ డీజిల్‌ ధర రూ.89.11కు చేరింది. ఇక ముంబైలో నిన్న‌ లీట‌రు పెట్రోలు ధ‌ర రూ.97.34, డీజిల్ ధ‌ర రూ.88.49గా ఉండ‌గా, ఈ రోజు పెట్రోల్‌ ధర రూ.97.61, డీజిల్‌ ధర రూ.88.82కి చేరింది.


More Telugu News