ప్రాణాపాయం నుండి బయటపడ్డ అరుణ్ పాండ్యన్!
- ఛాతి నొప్పితో ఆసుపత్రికి వెళ్లిన అరుణ్ పాండ్యన్
- కోవిడ్ టెస్టులు నిర్వహించగా పాజిటివ్ అని తేలిన వైనం
- గుండె వాల్వుల్లో 90 శాతం బ్లాక్స్ ఉన్నాయని గుర్తించిన వైద్యులు
తెలుగు వారికి కూడా సుపరిచితుడైన ప్రముఖ తమిళ సినీ నటుడు అరుణ్ పాండ్యన్ గత నెల తీవ్ర అనారోగ్యానికి గురై ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. ఈ విషయాన్ని ఆయన కుమార్తె కీర్తి సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.
ఒక రోజు రాత్రి తన తండ్రికి ఛాతి నొప్పి రావడంతో ఆసుపత్రికి తీసుకెళ్లామని... అయితే హాస్పిటల్ లో కోవిడ్ టెస్ట్ నిర్వహించగా పాజిటివ్ అని తేలడంతో ఎంతో భయపడిపోయామని కీర్తి తెలిపారు. ఆ తర్వాత దాదాపు 15 రోజుల పాటు హోమ్ క్వారంటైన్ లో ఉంటూ ఆయన చికిత్స తీసుకున్నారని చెప్పారు. అప్పటికే ఆయన కరోనా వ్యాక్సిన్ ఫస్ట్ డోస్ తీసుకోవడంతో కరోనా తీవ్రత ఎక్కువగా లేదని తెలిపారు.
15 రోజుల తర్వాత మరోసారి గుండె సంబంధిత పరీక్షలను నిర్వహించగా... రెండు వాల్వుల్లో 90 శాతం వరకు బ్లాక్స్ ఉన్నాయని తేలిందని చెప్పారు. కరోనా పరిస్థితుల్లో కూడా తన తండ్రి ఎంతో ధైర్యంతో యాంజియోప్లాస్టీకి సిద్ధమయ్యారని... ఆయనకు నిర్వహించిన చికిత్స విజయవంతమయిందని తెలిపారు. ఆయన ఇప్పుడు కోలుకుంటున్నారని చెప్పారు.