'బద్రి' రిలీజ్ రోజున పూరి డీలాపడిపోయాడట!

  • పూరి చాలా కష్టపడేవాడు
  • 'బద్రి' సినిమాపైనే ఆశలు పెట్టుకున్నాడు
  • రిలీజ్ రోజున డివైడ్ టాక్
  • ఆ తరువాత హిట్ టాక్ తో సంతోషం
పూరి జగన్నాథ్ ఇప్పుడంటే స్టార్ డైరెక్టర్ .. కానీ ఈ స్థాయికి రావడానికి ఆయన చాలా కష్టపడ్డాడు. తప్పకుండా డైరెక్టర్ గా తన పేరును సిల్వర్ స్క్రీన్ పై చూసుకోవాలని తపన పడ్డాడు. తాజా ఇంటర్వ్యూలో ఆయన గురించి రఘు కుంచె మాట్లాడాడు.

"పూరి జగన్నాథ్  దర్శకుడిగా అవకాశాల కోసం కథలు పట్టుకుని తిరుగుతున్న సమయంలో నేను ఒక 'కేఫ్' దగ్గర పరిచయమయ్యాను. అలా మా పరిచయం స్నేహంగా మారడంతో, ఇద్దరం ఒకే రూమ్ ను షేర్ చేసుకున్నాం. పూరి తన పనిని ఒక తపస్సులా చేయడం చూసి నేను ఆశ్చర్యపోయేవాడిని.

పవన్ కల్యాణ్ తో తన తొలి సినిమా 'బద్రి'ని ఏంతో కష్టపడి పట్టాలెక్కించాడు. ఎంతో నమ్మకంతో ఆ కథను తెరకెక్కించాడు. ఆ సినిమా విడుదల రోజే తన భవిష్యత్తును నిర్ణయిస్తుందని భావించాడు. రిలీజ్ రోజున డివైడ్ టాక్ రావడంతో చాలా డీలాపడిపోయాడు. కానీ ఆ తరువాత నుంచి ఆ సినిమా వసూళ్లపరంగా పుంజుకుంటూ హిట్ టాక్ తెచ్చుకుంది. అప్పుడు మళ్లీ ఆయనలో ఒక రకమైన కసి చూశాను. నేను పాటలు పాడతానని తెలిసి, 'బాచీ'లో .. 'లచ్చిమి లచ్చిమి' సాంగ్ పాడే అవకాశం నాకు ఇచ్చాడు. లేదంటే ఆ పాటను 'చక్రి' పాడాలనుకున్నాడు" అని చెప్పుకొచ్చాడు.


More Telugu News