ముస్లింలకు రంజాన్ తోఫా... 400 మందికి కానుకలు అందజేసిన మంత్రి వెల్లంపల్లి
- ఈ నెల 14న రంజాన్
- విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో కార్యక్రమం
- హాజరైన ఏపీ దేవాదాయశాఖ మంత్రి
- 8 రకాల సరుకులతో కూడిన కానుకల పంపిణీ
ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు ముస్లింలకు రంజాన్ తోఫా అందజేశారు. ఈ నెల 14న రంజాన్ పండుగ జరుపుకోనున్న నేపథ్యంలో, విజయవాడ పశ్చిమ నియోజకవర్గం భవానీపురం షహాబ్ దర్గా వద్ద ముస్లింలకు రంజాన్ తోఫా పేరిట కానుకలు పంపిణీ చేశారు. ఎ.కె ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో 8 రకాల సరుకులతో కూడిన ఈ కానుకలను దాదాపు 400 మంది ముస్లింలకు అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి వెల్లంపల్లి మాట్లాడుతూ, భక్తి విశ్వాసాలకు ప్రతీక రంజాన్ పండగ అని పేర్కొన్నారు. కరోనా కష్టకాలంలో రంజాన్ పండుగను పేదలు కూడా ఆనందంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో దాతల సహకారంతో రంజాన్ తోఫా అందజేసినట్లు మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు అబ్దుల్ సత్తార్, అబ్దుల్ కలీమ్, అబ్దుల్ రహమాన్, 41వ డివిజన్ వైసీపీ నాయకులు, స్థానిక కార్పొరేటర్ మహమ్మద్ ఇర్ఫాన్ తదితరులు పాల్గొన్నారు