తన భార్య చనిపోయిందనే వార్తలపై అనుపమ్ ఖేర్ స్పందన!
- నా భార్య గురించి తప్పుడు కథనాలను ప్రచారం చేస్తున్నారు
- ఆమె ఆరోగ్యంగా ఉన్నారు
- ఈరోజు కరోనా వ్యాక్సిన్ సెకండ్ డోస్ కూడా వేయించుకున్నారు
ప్రముఖ బాలీవుడ్ నటుడు, బీజేపీ నేత అనుపమ్ ఖేర్ భార్య కిరణ్ ఖేర్ చనిపోయారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారంపై అనుపమ్ ఖేర్ స్పందించారు. ఈ వార్తలన్నీ గాలి వార్తలేనని అనుపమ్ ఖేర్ చెప్పారు.
సోషల్ మీడియా ద్వారా ఆయన స్పందిస్తూ... తన భార్య గురించి అవాస్తవాలు ప్రచారమవుతున్నాయని చెప్పారు. అందులో నిజం లేదని... ఆమె ఆరోగ్యంగా ఉన్నారని తెలిపారు. ఈ మధ్యాహ్నం ఆమె కరోనా వ్యాక్సిన్ సెకండ్ డోస్ కూడా వేయించుకున్నారని చెప్పారు. ఇలాంటి కట్టు కథనాలను ప్రచారం చేయవద్దని విన్నవించారు. కరోనా సమయంలో అందరూ కోవిడ్ నిబంధనలను పాటిస్తూ, సురక్షితంగా ఉండాలని కోరారు. అనుపమ్ ఖేర్ భార్య కూడా బాలీవుడ్ నటి అన్న విషయం తెలిసిందే. ఆమె బీజేపీ ఎంపీగా కూడా ఉన్నారు.