'పుష్ప' ఐటమ్ కోసం పూజ హెగ్డే లేదా దిశా పటాని!
- రెండు భాగాలుగా రానున్న 'పుష్ప'
- రెండవ భాగంలోనే ఐటమ్ సాంగ్
- ఊర్వశీ రౌతేలకి ఛాన్స్ లేనట్టే
అల్లు అర్జున్ .. సుకుమార్ కాంబినేషన్లో 'పుష్ప' రూపొందుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాలో, కథానాయికగా రష్మిక కనువిందు చేయనుంది. ఫహాద్ ఫాజిల్ ప్రతినాయకుడిగా నటిస్తున్న ఈ సినిమా, ఇప్పటికే చాలావరకూ చిత్రీకరణను జరుపుకుంది. ఈ సినిమాను రెండు భాగాలుగా విడుదల చేయాలనే నిర్ణయాన్ని రీసెంట్ గా తీసుకున్నారు. దసరాకి ఒక భాగం .. వచ్చే ఏడాదిలో మరొక భాగాన్ని విడుదల చేయనున్నారు.
సాధారణంగా సుకుమార్ - దేవిశ్రీ ప్రసాద్ కాంబినేషన్ అనగానే అదిరిపోయే ఐటమ్ సాంగ్ ఒకటి ఉంటుంది. అలాగే 'పుష్ప' సినిమా కోసం కూడా ఒక ఐటమ్ సాంగ్ ను ప్లాన్ చేశారు. ఈ ఐటమ్ సాంగ్ ను ఊర్వశీ రౌతేలాతో చేయించనున్నట్టు వార్తలు వచ్చాయి. కానీ పూజ హెగ్డే - దిశా పటాని పేర్లను పరిశీలిస్తున్నట్టుగా నిర్మాత చెప్పారు. రెండవ భాగంలోనే ఐటమ్ సాంగ్ ఉంటుందని అన్నారు. ఇద్దరూ నాజూకు భామలే .. కుర్రాళ్ల కలల రాణులే. మరి వీరిలో ఎవరు సెట్ అవుతారనేది చూడాలి.