'వీరమల్లు'లో రాణి పాత్రలో కనిపించనున్న జాక్వెలిన్!

  • క్రిష్ నుంచి 'హరిహర వీరమల్లు'
  • బందిపోటు పాత్రలో పవన్
  • కథానాయికగా నిధి అగర్వాల్
  • కరోనా కారణంగా ఆగిన షూటింగ్
పవన్ కల్యాణ్ కథానాయకుడిగా క్రిష్ దర్శకత్వంలో 'హరి హర వీరమల్లు' సినిమా రూపొందుతోంది. ఈ సినిమా కొంతవరకూ షూటింగు జరుపుకుంది. ఈ కథ మొఘల్ సామ్రాజ్యం నేపథ్యంలో నడుస్తుంది. బందిపోటు పాత్రలో పవన్ కనిపించనున్నాడు. ఆయన లుక్ కి అనూహ్యమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమాలో నిధి అగర్వాల్ ఒక కథనాయికగా నటిస్తుండగా, ఒక కీలకమైన పాత్రను జాక్వెలిన్ ఫెర్నాండేజ్ పోషిస్తోంది. ఆమె పాత్ర ఏమిటనే విషయం పట్ల అభిమానులు కుతూహలాన్ని వ్యక్తం చేస్తున్నారు.

మొఘల్ సామ్రాజ్యానికి చెందిన రాణి పాత్రలో జాక్వెలిన్ కనిపించనుందని చెబుతున్నారు. ఆమె పాత్ర చాలా పవర్ఫుల్ గా ఉండనుందని అంటున్నారు. దర్శకుడు క్రిష్ ఆమె పాత్రను చాలా ఇంట్రస్టింగ్ గా డిజైన్ చేశాడని చెబుతున్నారు. ఈ సినిమాకి ప్రత్యేకమైన ఆకర్షణగా ఆమె పాత్ర నిలుస్తుందని అంటున్నారు. కరోనా ప్రభావం తగ్గిన తరువాత ఈ సినిమా షూటింగు తిరిగి మొదలవుతుందని చెబుతున్నారు. పవన్ అభిమానులందరి దృష్టి ఇప్పుడు ఈ సినిమాపైనే ఉంది.


More Telugu News