హైదరాబాద్‌లో భారీ చోరీ.. ఐదు ఇళ్లను కొల్లగొట్టిన దొంగలు

  • జియాగూడలో రెచ్చిపోయిన దొంగలు
  • వరుసగా ఐదిళ్లలో చోరీ
  • రూ. 20 లక్షల నగదు, రూ. 45 తులాల బంగారం చోరీ
హైదరాబాద్‌లో గత అర్ధరాత్రి దోపిడీ దొంగలు చెలరేగిపోయారు. నగరంలోని జియాగూడ వెంకటేశ్వరనగర్ కాలనీలో వరుస దొంగతనాలకు పాల్పడ్డారు. కరోనా భయంతో సొంతూళ్లకు వెళ్లిపోయిన వారి ఇళ్లను టార్గెట్‌గా చేసుకుని చెలరేగిపోయారు. వరుసగా ఐదు ఇళ్లలో చోరీలకు పాల్పడ్డారు.

రూ. 20 లక్షల నగదు, రూ. 45 తులాల బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లినట్టు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో బాధితులు పేర్కొన్నారు. క్లూస్‌టీంతో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆధారాలు సేకరించారు. సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు.


More Telugu News