తెలంగాణ ప్ర‌భుత్వ తీరును నిర‌సిస్తూ ఎమ్మెల్యే సీత‌క్క నిర‌స‌న‌

  • క‌రోనా చికిత్స‌ను వెంట‌నే ఆరోగ్య శ్రీ‌లో చేర్చాలి
  • మ‌రిన్ని ఉచిత అంబులెన్స్ సేవ‌ల‌ను అందుబాటులోకి తీసుకురావాలి
  • ఇళ్ల వ‌ద్ద‌కు వెళ్లి ప్ర‌భుత్వ‌మే ఉచిత వ్యాక్సిన్ వేయాలి
  • కరోనా మృతుల‌కు ప్ర‌భుత్వ‌మే అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించాలి
క‌రోనా స‌మ‌యంలో తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌ద‌ర్శిస్తోన్న‌ తీరును నిర‌సిస్తూ హైదరాబాద్ లో తెలుగుతల్లి ప్లైఓవర్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఎమ్మెల్యే సీత‌క్క నిర‌స‌న తెలిపారు. అంబేద్క‌ర్ విగ్ర‌హానికి విన‌తిప‌త్రం స‌మ‌ర్పించిన సీత‌క్క అక్క‌డే శాంతియుత నిర‌స‌నను కొన‌సాగిస్తున్నారు. క‌రోనా చికిత్స‌ను వెంట‌నే ఆరోగ్య శ్రీ‌లో చేర్చాలని ఆమె డిమాండ్ చేశారు.

రాష్ట్ర వ్యాప్తంగా మ‌రిన్ని ఉచిత అంబులెన్స్ సేవ‌ల‌ను అందుబాటులోకి తీసుకురావాలని ఆమె అన్నారు. క‌రోనా వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ‌లో కొన‌సాగుతోన్న గంద‌ర‌గోళాన్ని తొలగించాల‌ని, ఇళ్ల వ‌ద్ద‌కు వెళ్లి ప్ర‌భుత్వ‌మే ఉచిత వ్యాక్సిన్ వేయాలని ఆమె డిమాండ్ చేశారు. కరోనా మృతుల‌కు ప్ర‌భుత్వ‌మే అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించాలని ఆమె అన్నారు.



More Telugu News