రేపే అందుబాటులోకి రానున్న డీఆర్‌డీవో 2డీజీ కరోనా ఔషధం

  • ఢిల్లీలో పంపిణీ చేయనున్న రాజ్‌నాథ్‌ సింగ్‌
  • తొలి విడతలో 10 వేల డోసుల పంపిణీ
  • ఇటీవలే ఆమోదం తెలిపిన డీసీజీఐ
  • కరోనా బాధితులు వేగంగా కోలుకోవడానికి సహకరిస్తున్న ఔషధం
డీఆర్‌డీవో అభివృద్ధి చేసిన కొవిడ్‌-19  ఔషధం  2-డియాక్సీ డి-గ్లూకోజ్‌(2డీజీ) రేపే అందుబాటులోకి రానుంది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ సోమవారం దేశ రాజధాని ఢిల్లీలోని పలు ఆసుపత్రుల్లో మొత్తం 10 వేల డోసులు పంపిణీ చేయనున్నారు. పొడి రూపంలో రానున్న ఈ ఔషధాన్ని నీటితో కలిపి తీసుకోవాల్సి ఉంటుంది.

ఫార్మా దిగ్గజం డాక్టర్‌ రెడ్డీస్‌ సహకారంతో డీఆర్‌డీవో 2డీజీ ఔషధాన్ని అభివృద్ధి చేసింది. దీని వినియోగానికి డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా(డీసీజీఐ) ఇటీవలే అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. ఓ మోస్తరు నుంచి తీవ్రమైన కొవిడ్‌ లక్షణాలున్న వారిలో ఇది సమర్థంగా పనిచేస్తున్నట్లు క్లినికల్‌ ట్రయల్స్‌లో వెల్లడైంది. కరోనా బాధితులు వేగంగా కోలుకోవడానికి ఇది సహకరిస్తుందని కృత్రిమ ఆక్సిజన్‌ అవసరాన్ని తగ్గిస్తోందని డీఆర్‌డీవో తెలిపింది.


More Telugu News