'ఎఫ్ 3' టీమ్ ఇక రంగంలోకి దిగుతోంది!
- వినోదమే ప్రధానంగా సాగే 'ఎఫ్ 3'
- వచ్చేనెల 16 నుంచి నెక్స్ట్ షెడ్యూల్
- డబ్బు చుట్టూ తిరిగే కథ
- దసరాకి గానీ సంక్రాంతికి గాని విడుదల
కెరియర్ ఆరంభం నుంచి అనిల్ రావిపూడి వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం ఆయన 'ఎఫ్ 3' సినిమాను చేస్తున్నాడు. కరోనా కారణంగా ఈ సినిమా షూటింగు వాయిదా పడింది. మరోపక్క, 'నారప్ప' .. 'దృశ్యం 2' ప్రాజెక్టులతో వెంకటేశ్ బిజీగా ఉండటం వలన, ఆయన కాంబినేషన్లో వచ్చే సన్నివేశాల చిత్రీకరణ జరగలేదు. ఇతర ఆర్టిస్టుల కాంబినేషన్లో మాత్రం కొంత షూటింగ్ చేశారు.
ఈ నేపథ్యంలో ఇక తదుపరి షెడ్యూల్ ను మొదలుపెట్టాలనే నిర్ణయానికి ఈ టీమ్ వచ్చిందనేది తాజా సమాచారం. కరోనా సమయమే అయినప్పటికీ, సెట్లోనే షూటింగు కావడం వలన మొదలు పెట్టేద్దామని అనుకుంటున్నారట. వచ్చేనెల 16వ తేదీ నుంచి షూటింగుకు వెళ్లే విధంగా ఏర్పాట్లు చేసుకుంటున్నారు.
హైదరాబాద్, సారథీ స్టూడియోస్ లో వేసిన ప్రత్యేకమైన సెట్లో వెంకటేశ్ .. వరుణ్ తేజ్ ల కాంబినేషన్లో కొన్ని కామెడీ సీన్స్ ను చిత్రీకరించనున్నారు. భార్యలు ఎక్కువ డబ్బు సంపాదించమని భర్తలను ఒత్తిడి చేసి ఫ్రస్ట్రేషన్ కి గురిచేయడం ప్రధానంగా ఈ కథ నడుస్తుందని అంటున్నారు. దసరాకిగానీ .. సంక్రాంతికిగాని ఈ సినిమాను విడుదల చేయనున్నారు.