కమలహాసన్ వివాదాస్పద వ్యాఖ్యల కేసును కొట్టివేసిన కోర్టు
- గతంలో మహాభారతం గురించి కమల్ వివాదాస్పద వ్యాఖ్యలు
- ఓ వ్యక్తి కోర్టులో పిటిషన్ దాఖలు
- నాలుగేళ్లు కొనసాగిన విచారణ
- మరోసారి ఇలాంటి ఘటనలు జరగనివ్వబోమని కమల్ న్యాయవాది హామీ
మహాభారతం గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కేసులో సినీ నటుడు కమల హాసన్‌పై మదురై కోర్టులో విచారణ కొనసాగుతోన్న విషయం తెలిసిందే. ఈ కేసులో ఆయనకు ఊరట లభించింది. 2017లో ఓ ఇంటర్వ్యూలో కమల్ మాట్లాడుతూ... మహాభారతం గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేయగా అప్పట్లో ఆయనపై తీవ్ర విమర్శలు వచ్చాయి.
హిందువుల మనోభావాలను కించపర్చేలా ఆయన వ్యాఖ్యలు చేశారని, చర్యలు తీసుకోవాలని నెల్‌లై జిల్లా పళైయూర్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా అప్పటి నుంచి విచారణ కొనసాగుతోంది. ఆ పిటిషన్‌ను కొట్టి వేయాల్సిందిగా కోరుతూ కమల హాసన్ కోర్టును ఆశ్రయించారు. భవిష్యత్తులో ఇలాంటి వివాదాస్పద ఘటనలు జరగకుండా చూసుకుంటామని కమల్ తరఫు న్యాయవాది హామీ ఇస్తున్నట్లు చెప్పారు. దీంతో కమలహాసన్‌పై కేసును కొట్టి వేస్తున్నట్లు కోర్టు చెప్పింది.