మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో ఒకే వ్య‌క్తిలో బ్లాక్, వైట్ ఫంగ‌స్

  • గ్వాలియ‌ర్‌లో ఓ వ్య‌క్తికి నిర్ధార‌ణ‌
  • దేశంలో మొద‌టిసారి ఈ త‌ర‌హా కేసు
  • పెరిగిపోతోన్న బ్లాక్ ఫంగ‌స్ కేసులు
క‌రోనాతో అల్లాడిపోతోన్న భార‌త్‌లో బ్లాక్ ఫంగస్ కేసులు క‌ల‌క‌లం రేపుతోన్న విష‌యం తెలిసిందే. కొంద‌రిలో వైట్ ఫంగ‌స్ కూడా నిర్ధార‌ణ అవుతోంది. అయితే, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో ఓ వ్య‌క్తికి బ్లాక్ ఫంగ‌స్‌తో పాటు వైట్ ఫంగ‌స్ కూడా ఒకేసారి సోకింది.

గ్వాలియ‌ర్‌లోని ఓ రోగిలో ఈ ఫంగ‌స్‌ల‌ను గుర్తించారు. దేశంలో ఈ త‌ర‌హా కేసు న‌మోదు కావ‌డం ఇదే మొట్ట‌మొద‌టి సారి. ఇప్ప‌టికే ప‌లు రాష్ట్రాలు బ్లాక్ ఫంగ‌స్‌ను అంటువ్యాధుల నిరోధ‌క చ‌ట్టం కింద మ‌హ‌మ్మారిగా గుర్తించాయి. క‌రోనా సోకి స్టెరాయిడ్ థెర‌ఫీ తీసుకున్న వారిలో, మ‌ధుమేహం అదుపులోని లేని వారిలో బ్లాక్ ఫంగ‌స్ కేసులు నిర్ధార‌ణ అవుతున్నాయి.




More Telugu News