సాయితేజ్ జోడీగా 'ఉప్పెన' బ్యూటీ?

  • 'ఉప్పెన'తో విపరీతమైన క్రేజ్
  • చేతిలో మూడు సినిమాలు
  • వరుసగా వచ్చి పడుతున్న అవకాశాలు
ఈ మధ్య కాలంలో యూత్ హృదయాలను పెద్ద మొత్తంలో దోచేసిన కథానాయికగా కృతి శెట్టి కనిపిస్తుంది. తొలి సినిమాతోనే ఈ అమ్మాయి అనేక మంది అభిమానులను సంపాదించుకుంది. అంతేకాదు వరుస అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతోంది. ప్రస్తుతం ఈ అమ్మాయి చేస్తున్న సినిమాలు మూడు సెట్స్ పై ఉన్నాయి. ఈ సినిమాలన్నీ కూడా ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. ఈ నేపథ్యంలో ఈ సుందరి సాయితేజ్ జోడీగా ఒక సినిమా చేయనున్నట్టుగా వార్తలు వస్తున్నాయి.

దేవ కట్టా దర్శకత్వంలో 'రిపబ్లిక్' సినిమాను పూర్తిచేసిన సాయితేజ్, ఆ తరువాత సినిమాను కార్తీక్ దండు దర్శకత్వంలో చేయనున్నాడు. ఇతను కూడా సుకుమార్ శిష్యుడే. థ్రిల్లర్ నేపథ్యంలో ఈ సినిమా రూపొందనుంది. ఈ సినిమాలో కథానాయిక పాత్ర కోసం కృతి శెట్టిని తీసుకోనున్నట్టు చెప్పుకుంటున్నారు. 'ఉప్పెన' సినిమా వెనుక సుకుమార్ ఉన్న సంగతి తెలిసిందే. ఆయన శిష్యుడు చేస్తున్న సినిమా కావడం వలన, కృతి శెట్టి కాదనే అవకాశమే లేదని అనుకుంటున్నారు.  


More Telugu News