ఈటలతో భేటీ అయిన కోదండరాం, కొండా విశ్వేశ్వర్ రెడ్డి

  • భవిష్యత్ కార్యాచరణను ముమ్మరం చేసిన ఈటల
  • బీజేపీలో చేరుతున్నట్టు వార్తలు 
  • పలువురు బీజేపీ నేతలతో టచ్ లో ఉన్న ఈటల
తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి ఈటల రాజేందర్ తన భవిష్యత్ కార్యాచరణను ముమ్మరం చేశారు. పలువురు నేతలు ఆయనతో భేటీ అవుతున్నారు. తాజాగా ఈరోజు ఆయన నివాసంలో టీజేఎస్ అధినేత ప్రొఫెసర్ కోదండరాం, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి భేటీ అయ్యారు. భవిష్యత్ కార్యాచరణపై ఆయనతో చర్చించారు.

మరోవైపు ఈటల బీజేపీలో చేరబోతున్నట్టు సమాచారం అందుతోంది. ఈ క్రమంలో ఆయన ఈరోజు ఢిల్లీకి పయనమవుతున్నట్టు కూడా తెలుస్తోంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ అయి, కాషాయం కండువా కప్పుకోనున్నట్టు చెపుతున్నారు  ఈటలతో పాటు ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి కూడా బీజేపీలో చేరనున్నట్టు సమాచారం.

గత కొన్ని రోజులుగా బీజేపీ కీలక నేతలతో ఈటల టచ్ లో ఉన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, మాజీ ఎంపీ వివేక్, తెలంగాణ బీజేపీ ఇన్చార్జి తరుణ్ ఛుగ్ లతో ఆయన ఫోన్ ద్వారా మాట్లాడారు. ఇదే సమయంలో కేసీఆర్ వ్యతిరేక శక్తలను ఏకం చేసే పనిలో ఈటల ఉన్నట్టు తెలుస్తోంది.


More Telugu News