నైజీరియాలో 200 మంది చిన్నారులను కిడ్నాప్ చేసిన ఉగ్రవాదులు
- ఉత్తర నైగర్ రాష్ట్రంలోని టెజీనా నగరంలో ఘటన
- మారణాయుధాలతో వచ్చిన ఉగ్రవాదులు
- డబ్బు కోసం పదే పదే కిడ్నాప్ ఘటనలు
నైజీరియాలోని ఓ పాఠశాల నుంచి సుమారు 200 మంది విద్యార్థులను ఉగ్రవాదులు కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. ఉత్తర నైగర్ రాష్ట్రంలోని టెజీనా నగరంలోని సలిహూ తంకో ఇస్లామిక్ పాఠశాలలో జరిగిన ఈ ఘటన కలకలం రేపుతోంది. మారణాయుధాలతో వచ్చిన ఉగ్రవాదులు పాఠశాలపై దాడి చేశారని అక్కడి అధికారులు మీడియాకు తెలిపారు. ఈ ఘటనలో ఒక వ్యక్తి మృతి చెందాడని వివరించారు.
అప్రమత్తమైన పోలీసులు విద్యార్థుల కోసం గాలింపు చర్యలు జరుపుతున్నారు. కాగా, డబ్బుకోసం పాఠశాల్లలో ముష్కరులు వరుసగా దాడులకు పాల్పడుతూ కలకలం రేపుతున్నారు. కొన్ని నెలల క్రితం కూడా జాంఫారా రాష్ట్రంలోని జాంగెబేకు చెందిన ఓ బోర్డింగ్ స్కూలు నుంచి 300 మంది బాలికలను ముష్కరులు కిడ్నాప్ చేసి, అనంతరం విడిచిపెట్టారు. ఆరు నెలల్లో ఇటువంటి కిడ్నాప్ ఘటనలు ఆరుసార్లు జరిగాయి.