పవన్, అకీరా, ఓ సంగీతం టీచర్... ఫొటో వైరల్

  • సంగీతం నేర్చుకుంటున్న అకీరా నందన్
  • కుమారుడి సంగీతం క్లాసుకు పవన్
  • అకీరా సంగీతం నేర్చుకుంటున్న తీరు పరిశీలన
  • సోషల్ మీడియాలో సందడి చేస్తోన్న ఫొటో
జనసేనాని పవన్ కల్యాణ్ కు చెందిన తాజా ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ ఫొటోలో ఆయన పక్కన కుమారుడు అకీరా నందన్ ఉండడంతో ఫ్యాన్స్ కు కన్నులపండువగా ఉంది. అంతేకాదు, ఈ ఫొటోలో అకీరా మ్యూజిక్ టీచర్ కూడా ఉన్నారు. పవన్ తనయుడు అకీరా కొంతకాలంగా ఓ సంగీత విద్వాంసురాలు వద్ద పాఠాలు నేర్చుకుంటున్నాడు.

కొడుకు సంగీత పాఠాలు ఎలా నేర్చుకుంటున్నాడన్న విషయాన్ని పవన్ స్వయంగా పరిశీలించారు. అకీరా మ్యూజిక్ క్లాస్ లో ఉండగా, పవన్ విచ్చేసినప్పుడు క్లిక్ మనిపించిన ఆ ఫొటోనే సోషల్ మీడియాలో సందడి చేస్తోంది.


More Telugu News