తెలంగాణలో సెంచరీ దాటిన లీటర్ పెట్రోల్ ధర

  • రోజురోజుకు పెరుగుతున్న పెట్రోల్ ధరలు
  • వాహనదారుల నడ్డి విరుస్తున్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ట్యాక్సులు
  • ఆదిలాబాద్ లో లీటర్ పెట్రోల్ ధర రూ. 100.23.
దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు మండిపోతున్నాయి. ఇటీవల వివిధ రాష్ట్రాలకు జరిగిన ఎన్నికల తర్వాత ఇంధన ధరలు మళ్లీ పెరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వ ట్యాక్సులు, రాష్ట్ర ప్రభుత్వాల ట్యాక్సులు అన్నీ కలిసి వాహనదారుల నడ్డి విరిచేస్తున్నాయి. తెలంగాణలో సైతం పెట్రోల్ ధర సెంచరీ దాటింది. ఆదిలాబాద్ లో లీటర్ పెట్రోల్ రూ. 100.23 పైసలుగా ఉంది.

అంతర్జాతీయ మార్కెట్లో ఇంధన ధరలు పెరుగుతుండటం మన మార్కెట్ పై ప్రభావం చూపుతోంది. ఏపీలో కూడా పెట్రోల్ ధరలు రూ. 100 మార్క్ ను దాటేసిన సంగతి తెలిసిందే.


More Telugu News