భారత వృద్ధి రేటు అంచనాలను కుదించిన ప్రపంచ బ్యాంకు!

  • 10.1 శాతం నుంచి 8.3 శాతానికి కోత
  • 2022-23లో జీడీపీ 7.5 శాతం
  • 2023-24లో జీడీపీ 6.5 శాతం
  • ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు 5.6 శాతం
2021-22 ఆర్థిక సంవత్సరంలో భారత వృద్ధి రేటు అంచనాలను ప్రపంచ బ్యాంకు తగ్గించింది. మార్చిలో 10.1 శాతంగా ఉండనున్నట్లు అంచనా వేసిన బ్యాంకు ఇప్పుడు దాన్ని 8.3 శాతానికి కుదించింది. ఇక 2022-23లో జీడీపీ 7.5 శాతంగా, 2023-24లో 6.5 శాతంగా ఉండనున్నట్లు తెలిపింది.

కరోనా సంక్షోభం నుంచి వేగంగా కోలుకుంటున్న భారత ఆర్థిక వ్యవస్థను రెండో దశ తీవ్రంగా దెబ్బతీసిందని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో జీడీపీ అంచనాల్ని కుదించాల్సి వచ్చిందని వివరించింది. ఇక ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు ఈ ఆర్థిక సంవత్సంలో 5.6 శాతంగా ఉండనున్నట్లు ప్రపంచ బ్యాంకు అంచనా వేసింది. వృద్ధిని పోత్సహిస్తూ తీసుకునే విధానపరమైన నిర్ణయాలు, మౌలిక వసతుల కల్పనపై చేసే వ్యయం, గ్రామీణ ప్రాంతాల్లో చేసే అభివృద్ధి పనుల వంటి చర్యలు వృద్ధి రేటుకు ఊతమివ్వనున్నట్లు పేర్కొంది.


More Telugu News