జేసీ సోదరులకు వన్ ప్లస్ వన్ గన్‌మెన్ కేటాయింపు
- గతేడాది డిసెంబరులో తాడిపత్రి ఎమ్మెల్యేతో జేసీ సోదరులకు ఘర్షణ
- ప్రాణహాని ఉందని, గన్‌మెన్‌ను కేటాయించాలంటూ ప్రభుత్వానికి దరఖాస్తు
- తాజాగా ఆదేశాలు జారీ చేసిన ప్రభుత్వం
తమకు గన్‌మెన్లను కేటాయించాలంటూ అనంతపురం మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి, తాడిపత్రి మునిసిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి చేసిన అభ్యర్థనకు ప్రభుత్వం స్పందించింది. జేసీ సోదరులిద్దరికీ వన్ ప్లస్ వన్ గన్‌మెన్లను కేటాయిస్తూ ప్రభుత్వం తాజాగా ఆదేశాలు జారీ చేసింది.
ఈ మేరకు తాడిపత్రి డీఎస్పీ వీఎన్‌కే చైతన్య తెలిపారు. తాడపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి, జేసీ సోదరులకు మధ్య గతేడాది డిసెంబరు 24న ఘర్షణలు జరిగాయి. ఈ నేపథ్యంలో తమకు ప్రాణభయం ఉందని, గన్‌మెన్లను కేటాయించాలంటూ జేసీ సోదరులు ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో స్పందించిన ప్రభుత్వం తాజాగా వీరికి వన్ ప్లస్ వన్ గన్‌మెన్లను కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.