వీటన్నింటిపైనా విచారణ జరిపిస్తాం: అశోక్ గ‌జ‌ప‌తి రాజుపై విజ‌య‌సాయిరెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు

  • అశోక్‌గజపతిరాజు గారు మాన్సాస్‌ చైర్మన్‌గా ఉండగా అవినీతి
  • 2016లో ప్రభుత్వం నుంచి ఒక దొంగ జీవో తీసుకొచ్చింది
  • 115 ఎకరాలను చట్టవిరుద్ధంగా అమ్మేశారు
  • 2010లోనూ 500 పైగా ఎకరాలను కాజేశారు
కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు మ‌ళ్లీ మాన్సాస్ ఛైర్మన్‌గా బాధ్య‌త‌లు చేప‌ట్టిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఆయ‌న‌పై వైసీపీ నేత‌లు విమ‌ర్శ‌లు గుప్పిస్తున్నారు. వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి స్పందిస్తూ అశోక్ గ‌జ‌ప‌తి రాజుపై ప‌లు ఆరోప‌ణ‌లు చేశారు.

'అశోక్‌ గజపతిరాజు గారు మాన్సాస్‌ చైర్మన్‌గా ఉండగా 2016లో ప్రభుత్వం నుంచి ఒక దొంగ జీవో తీసుకొచ్చి 115 ఎకరాలను చట్టవిరుద్ధంగా అమ్మేశారు. 2010 లోనూ 500 పైగా ఎకరాలను కాజేశారు. వీటన్నింటిపైనా విచారణ జరిపిస్తాం' అని విజ‌య‌సాయిరెడ్డి పేర్కొన్నారు.

కాగా, గ‌తంలో సంచ‌యిత గ‌జ‌ప‌తిరాజును ఛైర్‌పర్సన్‌గా నియమిస్తూ ఏపీ ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను ఇటీవ‌ల హైకోర్టు ర‌ద్దు చేసిన విష‌యం తెలిసిందే. ఈ మేర‌కు ఆదేశాలు జారీ చేస్తూ అశోక్ గ‌జ‌ప‌తిరాజును మాన్సాస్ ట్ర‌స్ట్ ఛైర్మ‌న్‌గా పునర్నియమించాలని పేర్కొంది. దీంతో మాన్సాస్ ఛైర్మన్‌గా అశోక్ గ‌జ‌ప‌తిరాజు బాధ్య‌త‌లు స్వీక‌రించారు.


More Telugu News