పవన్ సినిమాలో వినాయక్ కనిపించనున్నాడనేది నిజమే!

  • షూటింగు దశలో పవన్ రీమేక్ మూవీ
  • కీలకమైన పాత్రలో రానా
  • డైరెక్టర్ గా కనిపించనున్న వినాయక్
  • త్రివిక్రమ్ నుంచి స్క్రీన్ ప్లే - మాటలు  
తెలుగులో మాస్ ఆడియన్స్ పల్స్ తెలిసిన దర్శకులలో వినాయక్ ఒకరు. అయితే కొంతకాలంగా ఆయన సరైన హిట్లు ఇవ్వలేకపోయారు. దాంతో సహజంగానే ఆయనకి అవకాశాలు తగ్గుతూ వచ్చాయి. ఈ సమయంలోనే ఆయన నటన వైపు అడుగులు వేశారు. తానే ప్రధాన పాత్రధారిగా 'శీనయ్య' అనే ఒక సినిమా మొదలైంది కానీ .. మధ్యలోనే ఆగిపోయింది. అప్పటి నుంచి నటనవైపే వెళ్లిపోవాలా? దర్శకుడిగానే ఉండిపోవాలా? అనే ఆలోచనలో ఆయన పడినట్టుగా వార్తలు వచ్చాయి.

ఈ నేపథ్యంలోనే ఆయన పవన్ కల్యాణ్ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. అయితే అందులో నిజం ఉండకపోవచ్చని చాలామంది అనుకున్నారు .. కానీ అది నిజమే. ఈ విషయాన్ని వినాయక్ స్వయంగా చెప్పారు. "పవన్ కల్యాణ్ హీరోగా సాగర్ చంద్ర దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతోంది. మలయాళంలో హిట్ కొట్టిన 'అయ్యప్పనుమ్ కోషియుమ్' సినిమాకి ఇది రీమేక్. రానా కూడా ఒక ప్రధానమైన పాత్ర చేస్తున్నాడు. ఇందులో నేను ఒక చిన్న పాత్ర చేస్తున్నాను .. సినిమా డైరెక్టర్ గానే కనిపిస్తాను" అని వినాయక్ చెప్పారు. ఈ సినిమాకి స్క్రీన్ ప్లే - మాటలు త్రివిక్రమ్ అందించడం విశేషం.


More Telugu News