లాక్​ డౌన్​ ఆంక్షల్లో మరిన్ని సడలింపులను ప్రకటించిన రాజస్థాన్

  • రేపటి నుంచి అమల్లోకి
  • ప్రభుత్వ ఆఫీసులు సాయంత్రం వరకు
  • 60% మందికి వ్యాక్సిన్ వేస్తే పూర్తి సామర్థ్యంతో డ్యూటీలు
  • వ్యాక్సిన్ వేసుకున్న డ్రైవర్లు, కండక్టర్లకే విధులు
కరోనా కేసులు తగ్గుతుండడంతో లాక్ డౌన్ ను రాజస్థాన్ ప్రభుత్వం సడలించింది. సోమవారం నుంచి ఆంక్షల నుంచి మరిన్ని సడలింపులిస్తున్నట్టు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ప్రకటించారు. రేపు ఉదయం 5 గంటల నుంచి కొత్త మార్గదర్శకాలు అమల్లోకి వస్తాయన్నారు. నిన్న కొత్తగా రాజస్థాన్ లో 141 మంది కరోనా బారిన పడ్డారు.

ఇవీ ప్రభుత్వం ఇచ్చిన సడలింపులు..

*ఉద్యోగులు 25 మంది కన్నా తక్కువగా ఉన్న ప్రభుత్వ కార్యాలయాలు 100 శాతం సామర్థ్యంతో పనిచేయొచ్చు.
*ఉద్యోగులు 25 మంది కన్నా ఎక్కువగా ఉండే ఆఫీసుల్లో కేవలం 50 శాతం మందితోనే పనిచేయించాలి.
*కనీసం 60 శాతం మందికి వ్యాక్సిన్ వేయించిన ఆఫీసులు పూర్తి సామర్థ్యంతో పనిచేయొచ్చు.
*ఉదయం 9.30 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఆఫీసులను తెరవొచ్చు.
*గర్భిణులు, దివ్యాంగులు, ఇతర జబ్బులున్న వారికి ఇంటి నుంచే పనిచేసే వెసులుబాటు కల్పించాలి.
*సిటీల్లో బస్సులను ఉదయం 5 నుంచి రాత్రి 8 వరకు నడుపొచ్చు. అయితే, స్టాండింగ్ జర్నీకి అనుమతి లేదు. కనీసం ఒక్క డోసు వ్యాక్సిన్ అయినా తీసుకున్న డ్రైవర్, కండక్టర్లే డ్యూటీ చేయాలి.
*ప్రైవేట్ వాహనాలకూ ఉదయం 5 నుంచి రాత్రి 8 వరకు అనుమతి.
పబ్లిక్ పార్కులకు రాత్రి 8 గంటల వరకు అనుమతి.
*రెస్టారెంట్లు సోమవారం నుంచి శుక్రవారం వరకు తెరిచి ఉంచొచ్చు. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకే అనుమతి. వారాంతాల్లో మూత.
*అన్ని దుకాణాలు, క్లబ్బులు, జిమ్ములు, రెస్టారెంట్లు, మాల్స్, ఇతర వాణిజ్య సముదాయాల్లో సిబ్బందికి వ్యాక్సినేషన్ చేయించాలి.
*కనీసం 60 శాతం మంది సిబ్బందికి వ్యాక్సిన్ వేయించిన జిమ్ములు, షాపింగ్ మాల్స్, వాణిజ్య సముదాయాలకు సాయంత్రం 7 గంటల వరకు తెరిచి ఉంచే అవకాశం. గతంలో ఇచ్చిన దానికి అదనంగా మూడు గంటల సమయం.
*జులై 1 నుంచి ఫంక్షన్ హాళ్లలో పెళ్లిళ్లు, ఇతర కార్యాలకు అనుమతి. అయితే, 40 మందికి మించకూడదు. సాయంత్రం 4 గంటల లోపు పూర్తి చేయాలి.


More Telugu News