ఒకే బైక్‌పై వెళ్తున్న కొమురం భీమ్‌, అల్లూరి.. 'ఆర్ఆర్ఆర్' నుంచి ఆస‌క్తిక‌ర పోస్టర్ విడుద‌ల‌

  • చిరున‌వ్వులు చిందిస్తోన్న హీరోలు
  • శ‌ర‌వేగంగా షూటింగ్‌
  • మ‌రో రెండు పాట‌లు షూటింగ్ పూర్తి చేస్తే స‌రి
  • రెండు భాష‌ల్లో డబ్బింగ్ చెప్పిన తారక్, చెర్రీ 
రాజ‌మౌళి ద‌ర్వ‌క‌త్వంలో రూపుదిద్దుకుంటోన్న ఆర్ఆర్ఆర్ చిత్రం నుంచి కీలక అప్ డేట్ వెలువడింది. ఈ సినిమాలో కొమురం భీమ్‌గా ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ న‌టిస్తోన్న విష‌యం తెలిసిందే. వారిద్దరు ఒకే బైక్‌పై వెళ్తోన్న ఓ ఫొటోను ఆ సినిమా బృందం విడుద‌ల చేసింది. చిరున‌వ్వులు చిందిస్తూ వారిద్ద‌రు ఉన్న ఈ పోస్ట‌ర్ అభిమానుల్లో ఆస‌క్తిరేపుతోంది.

ఈ సినిమాకు సంబంధించిన అన్ని ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతున్నాయ‌ని ఆర్ఆర్ఆర్ బృందం తెలిపింది. రెండు పాట‌లు మిన‌హా ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ మొత్తం పూర్త‌యింద‌ని వివ‌రించింది. రెండు భాష‌ల్లోనూ తారక్, చెర్రీ డ‌బ్బింగ్ చెప్పార‌ని, మిగ‌తా భాష‌ల్లోనూ త్వ‌ర‌లోనే డ‌బ్బింగ్ చెప్పే ప‌నులు పూర్తి చేస్తార‌ని తెలిపింది.  

కాగా, ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్స్ ను ఒక్కొక్క‌టిగా వదులుతూ రాజ‌మౌళి ప్రేక్ష‌కుల్లో అంచ‌నాల‌ను మ‌రింత పెంచుతున్నారు. బాహుబలి సినిమాల త‌ర్వాత‌ రాజమౌళి రూపొందిస్తున్న 'ఆర్ఆర్ఆర్' సినిమాపై భారీ అంచ‌నాలు ఉన్నాయి. ఈ సినిమా దాదాపు రూ.400 కోట్ల బడ్జెట్‌తో రూపుదిద్దుకుంటోంది. ఆర్ఆర్ఆర్ చిత్రంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ తో పాటు అలియా భట్, ఒలీవియా మోరిస్, అజయ్ దేవగణ్ నటిస్తున్నారు.


More Telugu News