కరోనా కేసులు అత్యధికంగా ఉన్న ఆరు రాష్ట్రాలకు ప్రత్యేక బృందాలను పంపిన కేంద్రం
- కొన్ని రాష్ట్రాల్లో పెద్ద సంఖ్యలో నమోదవుతున్న కరోనా కేసులు
- జాబితాలో కేరళ, ఒడిశా, ఛత్తీస్ గఢ్, మణిపూర్, త్రిపుర, అరుణాచల్ ప్రదేశ్
- ఇద్దరు నిపుణులతో కూడిన బృందాలను పంపిన కేంద్రం
మన దేశంలో కొన్ని రాష్ట్రాల్లో కరోనా కేసులు తగ్గుతున్నప్పటికీ... మరికొన్ని రాష్ట్రాల్లో మాత్రం పెద్ద సంఖ్యలోనే నమోదవుతున్నాయి. కేసులు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో కేరళ, ఒడిశా, ఛత్తీస్ గఢ్, మణిపూర్, త్రిపుర, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఈ రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం హుటాహుటిన ప్రత్యేక బృందాలను పంపించింది.
కరోనా కట్టడికి చేపట్టాల్సిన చర్యలు, మేనేజ్ మెంట్, సర్వైలెన్స్, టెస్టింగ్, కంటైన్మెంట్ ఆపరేషన్స్, బెడ్ల అందుబాటు, అంబులెన్సులు, వెంటిలేటర్లు, తదితర విషయాల్లో ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ కమిటీలు తగిన సూచనలు చేస్తూ, సలహాలను ఇస్తూ సహకరిస్తాయి. ఈ హైలెవెల్ కమిటీల్లో ఇద్దరు సభ్యుల చొప్పున ఉన్నారు. వీరిలో ఒకరు వైద్యుడు కాగా, మరొకరు ప్రజావైద్య రంగంలో నిపుణుడు.