థియేటర్లకే వస్తానంటున్న 'గల్లీ రౌడీ'

  • సందీప్ కిషన్ నుంచి 'గల్లీ రౌడీ'
  • కథానాయికగా నేహా శెట్టి పరిచయం
  • త్వరలోనే భారీ స్థాయి విడుదల
  • వెయిట్ చేయమంటున్న హీరో  
మొదటి నుంచి కూడా సందీప్ కిషన్ వైవిధ్యభరితమైన పాత్రలను చేస్తూ వస్తున్నాడు. యూత్ కి .. మాస్ ఆడియన్స్ కి నచ్చే కథలను ఎంచుకుంటూ వెళుతున్నాడు. యాక్షన్ ... ఎమోషన్ తో పాటు, కామెడీ కూడా ఉండేలా చూసుకుంటున్నాడు. అలా ఇంతకుముందు జి.నాగేశ్వర రెడ్డి దర్శకత్వంలో చేసిన 'తెనాలి రామకృష్ణ బీఏబీఎల్' సినిమాకి మంచి ఆదరణ లభించింది. దాంతో ఆ తరువాత సినిమాను కూడా ఆయన జి.నాగేశ్వరరెడ్డితోనే చేశాడు .. ఆ సినిమా పేరే 'గల్లీ రౌడీ'.

ఎంవీవీ సత్యనారాయణ నిర్మించిన ఈ సినిమా విడుదలకి సిద్ధంగా ఉంది. దాదాపు ఈ సినిమా ఓటీటీలో రావొచ్చనే టాక్ వచ్చింది. కానీ 'ఇది థియేటర్లో చూడవలసిన సినిమా' అంటూ సందీప్ కిషన్, ఈ సినిమా థియేటర్లలోనే వస్తుందనే విషయాన్ని స్పష్టం చేశాడు. విడుదల తేదీ కోసం వెయిట్ చేయమని అన్నాడు. ఇది ఫన్ తో కూడిన మాస్ మసాలా మూవీ అని చెప్పాడు. ఈ సినిమాతో తెలుగు తెరకి కథానాయికగా 'నేహా శెట్టి' పరిచయమవుతోంది. జి. నాగేశ్వరరెడ్డి - సందీప్ కిషన్ కాంబినేషన్ లో రూపొందిన ఈ సినిమా, థియేటర్లో ఎంతలా నవ్వులు పూయిస్తుందో .. మాస్ ఆడియన్స్ ను ఎంతలా మెప్పిస్తుందో చూడాలి.  


More Telugu News