బాయ్ ఫ్రెండ్ ను హీరోగా ఎంకరేజ్ చేస్తున్న పాయల్!

  • యూత్ లో మంచి క్రేజ్
  • పుంజుకుంటున్న అవకాశాలు
  • సౌరభ్ తో ప్రేమలో
  • అతను పంజాబి నటుడు .. గాయకుడు  
తెలుగులో పాయల్ కి మంచి క్రేజ్ ఉంది .. యూత్ లో ఆమెకి మంచి ఫాలోయింగ్ ఉంది. అయితే ఆశించిన స్థాయిలో ఆమె ఎందుకు దూసుకువెళ్లడం లేదనే సందేహం చాలామందిలో ఉంది. తొందరపాటుతో ఆమె తీసుకున్న నిర్ణయాలే ఆమె వెనకబడటానికి కారణమనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇప్పుడిప్పుడే ఆమె తిరిగి పుంజుకోవడానికి చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నాయి. అంతేకాదు .. తన బాయ్ ఫ్రెండ్ ను హీరోగా చేయడానికి ఆమె చేసిన ప్రయత్నాలు కూడా ఫలించాయని చెప్పుకుంటున్నారు.

పంజాబి నటుడు .. గాయకుడు అయిన సౌరభ్ తో తాను కొంతకాలంగా ప్రేమలో ఉన్నట్టుగా ఆ మధ్య పాయల్ చెప్పింది. ఆయనతో ప్రేమలో ఉన్నానంటూ సోషల్ మీడియా వేదికగా పరిచయం కూడా చేసింది. తెలుగులో హీరోగా చేయాలని సౌరభ్ ముచ్చటపడటంతో, తనకి గల పరిచయాలను ఉపయోగించి ఒక ప్రాజెక్టును ఆమె సెట్ చేసిందని అంటున్నారు. త్వరలోనే ఆ ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలు బయటికి రానున్నాయి. "తెలుగులోకి పరిచయం అవుతున్నందుకు శుభాకాంక్షలు .. అన్నిటినీ దాటుకుని నువ్వు ముందుకు వెళ్లాలి" అంటూ సౌరభ్ ను ఉద్దేశిస్తూ ఇన్ స్టాలో ఆమె చేసిన పోస్ట్ ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.


More Telugu News