ఈ నెల 14న పోలవరం ప్రాజెక్టు సందర్శనకు సీఎం జగన్
- ఏర్పాట్లు చేస్తున్న జిల్లా కలెక్టర్
- ప్రాజెక్టు పనులను పరిశీలించనున్న జగన్
- అనంతరం అధికారులతో సమీక్ష
ఏపీ సీఎం జగన్ పోలవరంలో పర్యటించనున్నారు. ఈ నెల 14న ఆయన పోలవరం ప్రాజెక్టును సందర్శిస్తారు. ప్రాజెక్టు వద్ద పనులు జరుగుతున్న తీరును ఆయన స్వయంగా పరిశీలించనున్నారు. వీలైనంత వేగంగా పోలవరం ప్రాజెక్టును పూర్తిచేయాలని సీఎం జగన్ ఆకాంక్షిస్తున్నారు. ప్రాజెక్టు సందర్శన అనంతరం సీఎం జగన్ మంత్రులు, అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. కాగా, సీఎం పోలవరం పర్యటన ఖరారైన నేపథ్యంలో, పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు.