పుట్టిన రోజు సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రులకు నాలుగు అంబులెన్స్‌లు అందజేసిన బండి సంజయ్

  • కరీంనగర్, సిరిసిల్ల, వేములవాడ, హుజూరాబాద్ ఆసుపత్రులకు అంబులెన్సుల అందజేత
  • సంజయ్ సురక్ష పేరుతో 5 వేల మంది యువకులకు ప్రీమియం
  • అంబులెన్సులు, ఇతర వైద్య పరికరాలకు రూ. 3 కోట్ల ఖర్చు
తన పుట్టిన రోజును పురస్కరించుకుని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రభుత్వ ఆసుపత్రులకు నాలుగు అంబులెన్స్‌లు వితరణగా అందించారు. కరీంనగర్ పార్లమెంటు స్థానం పరిధిలోని కరీంనగర్, సిరిసిల్ల, వేములవాడ, హుజూరాబాద్‌లోని ఆసుపత్రులకు 3 కోట్ల రూపాయలతో అంబులెన్సులు, ఇతర వైద్య పరికరాలను అందించారు. అంతకుముందు వీటిని కరీంనగర్‌లోని తన కార్యాలయ ఆవరణలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తన నియోజకవర్గ పరిధిలో సంజయ్ సురక్ష పేరుతో బీమా యోజన, జీవనజ్యోతి బీమా పథకాల కింద 5 వేల మంది యువకులకు సొంత డబ్బులతో ప్రీమియం కడుతున్నట్టు బండి సంజయ్ ప్రకటించారు.


More Telugu News