జగన్ ను ఎవరైనా తప్పుదోవ పట్టిస్తున్నారా?: రఘురాజు

  • దేవాలయాలపై దాడులు జరగకూడదని చెప్పడం పార్టీ వ్యతిరేక నిర్ణయం కిందకు వస్తుందా?
  • నా అభిప్రాయాలు పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఉన్నాయా?
  • రాజ్యాంగానికి అనుకూలంగా మాట్లాడితే వేటు వేయాలని అంటారా?
వైసీపీపై ఆ పార్టీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు తన విమర్శలను ఎక్కుపెడుతూనే ఉన్నారు. తాజాగా ఈరోజు ఆయన మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దేవాలయాలపై దాడులు జరగకూడదని తాను చెప్పడం కూడా పార్టీ వ్యతిరేక నిర్ణయం కిందకు వస్తుందా? అని ఆయన ఎద్దేవా చేశారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి జగన్ ను ఎవరైనా తప్పుదోవ పట్టిస్తున్నారా? అని సందేహాన్ని వెలిబుచ్చారు. ఏపీలో దేవాలయాలపై జరిగిన దాడులను ఖండిస్తున్నానని తాను చెప్పడం వైసీపీ పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకమా? అని ప్రశ్నించారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

తాను వెల్లడిస్తున్న అభిప్రాయాలు పార్టీ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా ఉన్నాయా? అని రఘురాజు ప్రశ్నించారు. తన పార్లమెంటు సభ్యత్వంపై వేటు వేయాలని వైసీపీ చేస్తున్న డిమాండ్ కు కారణం ఏమిటని నిలదీశారు. తాను చేసిన తప్పు ఏమిటో వైసీపీ నేతలు చెప్పాలని డిమాండ్ చేశారు. రాజ్యాంగానికి అనుకూలంగా మాట్లాడితే వేటు వేయాలని అంటారా? అని మండిపడ్డారు.


More Telugu News