'మాస్ట్రో' నుంచి 'బేబీ ఓ బేబీ' సాంగ్ ప్రోమో!

  • హిందీ సినిమా రీమేక్ గా 'మాస్ట్రో'
  • నితిన్ లో ఇది 30వ సినిమా
  • కీలకపాత్రలో తమన్నా
  • ఈ ఏడాదిలోనే వచ్చే ఛాన్స్  
నితిన్ తాజా చిత్రంగా 'మాస్ట్రో' రూపొందుతోంది. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించిన ఈ సినిమా, షూటింగును పూర్తిచేసుకుని పోస్టు ప్రొడక్షన్ పనులను జరుపుకుంటోంది. కెరియర్ పరంగా నితిన్ కి ఇది 30వ సినిమా. ఈ సినిమాలో ఆయన జోడీగా నభా నటేశ్ కనువిందు చేయనుంది. మహతి స్వరసాగర్ ఈ సినిమాకి సంగీతాన్ని అందించాడు. తాజాగా కొంతసేపటి క్రితం ఈ సినిమా నుంచి సాంగ్ ప్రోమో వదిలారు. 'బేబీ ఓ బేబీ' అంటూ ఈ పాట సాగుతోంది.

శ్రీ జో సాహిత్యాన్ని అందించిన ఈ పాటను అనురాగ్ కులకర్ణి ఆలపించాడు. పూర్తి పాటను రేపు ఉదయం 10:08 నిమిషాలకు విడుదల చేయనున్నట్టుగా చెప్పారు. హీరోయిన్ ను ముగ్గులోకి దింపే ప్రయత్నంలో హీరో పాడే పాటగా ఇది తెరపై ప్రత్యక్షం కానుంది. హిందీలో హిట్ టాక్ తెచ్చుకున్న 'అంధదూన్' సినిమాకి ఇది రీమేక్. అక్కడ 'టబు' చేసిన కీలకమైన పాత్రను ఇక్కడ తమన్నా చేసింది. ఈ ఏడాదిలోనే ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఇక నితిన్ తన తదుపరి సినిమాను వక్కంతం వంశీ దర్శకత్వంలో చేయనున్న సంగతి తెలిసిందే.


More Telugu News