నింగికి ఎగిసి, సురక్షితంగా తిరిగొచ్చిన అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్

  • బ్లూ ఆరిజిన్ రోదసియాత్ర విజయవంతం
  • నలుగురు సభ్యులతో నింగికి ఎగిసిన న్యూ షెపర్డ్ నౌక
  • కొన్ని నిమిషాలు అంతరిక్షంలో గడిపిన బెజోస్ బృందం
  • సురక్షితంగా ల్యాండైన స్పేస్ కాప్స్యూల్
అమెజాన్ అధినేత జెఫ్ బెజోస్ అంతరిక్షయానం విజయవంతమైంది. నలుగురు సభ్యులను మోసుకుంటూ నింగికి ఎగిసిన న్యూ షెపర్డ్ వ్యోమనౌక విజయవంతంగా రోదసిలో ప్రవేశించగా, అక్కడ కొన్ని నిమిషాలు గడిపిన అనంతరం బెజోస్ బృందం స్పేస్ కాప్స్యూల్ సాయంతో సురక్షితంగా భూమికి తిరిగొచ్చింది.

బెజోస్ కు చెందిన బ్లూ ఆరిజిన్ అంతరిక్ష పరిశోధన సంస్థ ఈ రోదసియాత్ర చేపట్టింది. టెక్సాస్ లోని లాంచ్ ప్యాడ్ నుంచి ఈ రోదసియాత్ర చేపట్టారు. ఈ యాత్రలో బెజోస్ తో పాటు ఆయన సోదరుడు మార్క్ కూడా పాలుపంచుకున్నారు. ఈ యాత్రలో బెజోస్ తో పాటు 82 ఏళ్ల మహిళా పైలెట్ వేలీ ఫంక్ కూడా పాల్గొని, రోదసియాత్ర చేసిన పెద్ద వయస్కురాలిగా చరిత్ర సృష్టించారు.

కాగా, న్యూ షెపర్డ్ వ్యోమనౌకను మానవ సహిత రోదసియాత్రలకు అనువైనదా, కాదా? అని తెలుసుకునేందుకు ఇప్పటివరకు 15 పర్యాయాలు పరీక్షించారు. పశ్చిమ టెక్సాస్ ఎడారిలో బెజోస్ తదితరులు ఉన్న స్పేస్ కాప్స్యూల్ పారాచూట్ల సాయంతో ఎలాంటి పొరబాట్లకు తావులేకుండా ఎడారి ప్రాంతంలో ల్యాండైంది. అంతరిక్షం నుంచి భూమిని వీక్షించిన బెజోస్, ఇతరులు ముగ్ధులయ్యారు.


More Telugu News