ఏబీ వెంకటేశ్వరరావుపై మోపిన అభియోగాలపై విచారణ అధికారి నియామకం
- కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ గా ఆర్పీ సిసోడియా
- వాదనలకు ప్రభుత్వం తరఫు న్యాయవాది నియామకం
- ఆదేశాలు జారీ చేసిన సీఎస్
- వివరణ ఇవ్వాలని ఏబీకి ఆదేశం
ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుపై మోపిన అభియోగాలపై విచారణ అధికారిని నియమించారు. కమిషనర్ ఆఫ్ ఎంక్వైరీస్ గా ఆర్పీ సిసోడియాను నియమిస్తూ ఏపీ ప్రభుత్వం నేడు ఉత్తర్వులు జారీ చేసింది. సెక్షన్ 8 కింద నమోదైన అభియోగాలపై ఆర్పీ సిసోడియా విచారణ జరపనున్నారు. అభియోగాలపై వాదనలకు ప్రభుత్వం తరఫున న్యాయవాదిని నియమిస్తూ సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ ఆదేశాలు జారీ చేశారు. కాగా, అభియోగాలకు సంబంధించి వివరణను నిర్ణీత సమయంలో సమర్పించాలని ప్రభుత్వం ఏబీ వెంకటేశ్వరరావును ఆదేశించింది.
ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఏబీ వెంకటేశ్వరరావు కొనసాగిన సమయంలో పలు పరికరాల కొనుగోళ్లలో అక్రమాలు జరిగాయని ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే, తనపై కృత్రిమ డాక్యుమెంట్లు సృష్టించారని ఏబీ వెంకటేశ్వరరావు ఆరోపిస్తున్నారు.