షర్మిల పార్టీకి షాక్... రాజీనామా చేసిన చేవెళ్ల ప్రతాప్ రెడ్డి
- ఇటీవలే దూకుడు పెంచుతున్న షర్మిల
- పార్టీలో మొదలైన ఆధిపత్య పోరు
- రాఘవరెడ్డి వ్యవహారశైలికి నిరసనగా ప్రతాప్ రెడ్డి రాజీనామా
వైయస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల ఇటీవలే దూకుదు పెంచారు. రాష్ట్ర ప్రభుత్వం, సీఎం కేసీఆర్ లపై తీవ్ర విమర్శలు గుప్పిస్తూ ఆమె దూకుడుగా వ్యవహరిస్తున్నారు. తెలంగాణలో రాజన్న రాజ్యాన్ని స్థాపించడమే లక్ష్యంగా ఆమె ముందుకు సాగుతున్నారు. అన్ని జిల్లాల్లో పర్యటించే కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో షర్మిల పార్టీకి ఊహించని షాక్ తగిలింది. పార్టీకి చేవెళ్ల ప్రతాప్ రెడ్డి రాజీనామా చేశారు.
పార్టీ నేత రాఘవరెడ్డి వ్యవహారశైలికి నిరసనగా రాజీనామా చేస్తున్నట్టు ఆయన ప్రకటించారు. తన రాజీనామా లేఖను పార్టీ ప్రధాన కార్యాలయానికి పంపించారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు ప్రతాప్ రెడ్డి ఇన్ఛార్జిగా వ్యవహరించారు. ఆయన రాజీనామా చేయడం పార్టీలో అంతర్గతంగా కలకలం రేపుతోంది. పార్టీలో అప్పుడే ఆధిపత్య పోరు మొదలైందని కొందరు అంటున్నారు.