భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఎదురుకాల్పులు... మావోయిస్టు మృతి

  • చర్ల అటవీప్రాంతంలో కాల్పులు
  • మావోయిస్టు వారోత్సవాల నేపథ్యంలో కూంబింగ్
  • పోలీసులకు తారసపడిన మావోలు
  • ఓ నక్సల్ మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అటవీప్రాంతంలో కాల్పుల మోత మోగింది. చర్ల అటవీప్రాంతంలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ఒక మావోయిస్టు మృతి చెందినట్టు గుర్తించారు. సంఘటన స్థలం నుంచి ఒక 303 రైఫిల్, రెండు కిట్ బ్యాగులు స్వాధీనం చేసుకున్నారు.

మావోయిస్టు వారోత్సవాలపై పక్కా సమాచారంతో పోలీసులు ఇవాళ తెలంగాణ-చత్తీస్ గఢ్ సరిహద్దుల్లో కూంబింగ్ షురూ చేశారు. భద్రతా బలగాలను గమనించిన మావోలు కాల్పులు జరిపారు. ఒక మావోయిస్టు మృతదేహం ఘటన స్థలంలో పడివుండడాన్ని భద్రాద్రి జిల్లా ఎస్పీ సునీల్ దత్ నిర్ధారించారు. ఈ ఎదురుకాల్పుల్లో పోలీసు బలగాలదే పైచేయి కావడంతో మావోలు అక్కడ్నించి సురక్షిత ప్రాంతాలకు పరుగులు తీసినట్టు సమాచారం.


More Telugu News