విజయసాయిరెడ్డికి లీగల్ నోటీసులు పంపిన ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు
- గతంలో ఏబీపై ఆరోపణలు
- రూ.50 కోట్ల తరలింపుకు ఎస్కార్ట్ ఇచ్చారని ఆరోపణలు
- లీగల్ నోటీసులు పంపిన ఏబీ
- క్షమాపణ చెప్పాలని డిమాండ్
ఏపీ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావు పరువునష్టం కేసులో పలువురికి లీగల్ నోటీసులు పంపారు. ఏబీ వెంకటేశ్వరరావు నోటీసులు పంపిన వారిలో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కూడా ఉన్నారు. జగతి పబ్లికేషన్స్ ఎండీ సజ్జల రామకృష్ణారెడ్డి, సాక్షి టీవీ ఈడీ వినయ్ మహేశ్వరి, సాక్షి పత్రిక ఎడిటర్ మురళి, పత్రిక ప్రింటర్-పబ్లిషర్ రామచంద్రమూర్తిలకు ఏబీ నోటీసులు పంపారు.
ఎన్నికల్లో రూ.50 కోట్ల తరలింపునకు ఎస్కార్ట్ ఇచ్చినట్టు తనపై చేసిన ఆరోపణలకు ప్రతిస్పందనగా ఏబీ జులై 19న పరువునష్టం నోటీసులు పంపినట్టు వెల్లడైంది. తనపై చేసిన ఆరోపణల పట్ల బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని ఏబీ తన నోటీసుల్లో డిమాండ్ చేశారు. లేకపోతే కోటి రూపాయలకు పరువునష్టం దావా వేస్తానని హెచ్చరించారు.