పీవీ సింధు, కోచ్ టే శాంగ్ కు ఘన సత్కారం.. ఫొటోలు ఇవిగో!
- టోక్యో నుంచి ఢిల్లీకి చేరుకున్న సింధు
- ఘనంగా సత్కరించిన కేంద్ర మంత్రులు నిర్మల, కిషన్ రెడ్డి, ఠాకూర్
- ఫైనల్స్ మిస్ అయినప్పటికీ.. పతకం సాధించడం సంతోషంగా ఉందన్న సింధు
టోక్యో ఒలింపిక్స్ లో కాంస్య పతకం సాధించిన తెలుగుతేజం పీవీ సింధును ఘనంగా సత్కరించారు. నిన్న టోక్యో నుంచి ఆమె ఢిల్లీకి చేరుకున్నారు. ఈ సందర్భంగా సింధు, ఆమె కోచ్ పార్క్ టే శాంగ్ ను కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్, జి.కిషన్ రెడ్డి, అనురాగ్ ఠాకూర్ తదితరులు సత్కరించారు.
ఈ సందర్భంగా కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్ మాట్లాడుతూ, మన దేశ గొప్ప ఒలింపియన్లలో పీవీ సింధు ఒకరని కొనియాడారు. దేశం కోసం ఆడాలనుకునే భారత క్రీడాకారులందరికీ ఆమె ఆదర్శమని చెప్పారు. పీవీ సింధు మాట్లాడుతూ ఫైనల్స్ కు చేరడంలో విఫలమయినప్పటికీ... ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా పతకాన్ని సాధించడం సంతోషాన్నిచ్చిందని అన్నారు. వరుసగా రెండు ఒలింపిక్స్ లో పతకాలు సాధించడం ఆనందంగా ఉందని చెప్పారు.
తన కోసం ఎన్నో త్యాగాలు చేసి, నిరంతరం మద్దతిచ్చిన తల్లిదండ్రులకు, తన కల నిజమయ్యేలా తోడ్పాటును అందించిన కోచ్ కు కృతజ్ఞతలు తెలుపుతున్నానని అన్నారు. ఈ సన్మాన కార్యక్రమంలో పీవీ సింధు తల్లి కూడా పాల్గొన్నారు.