మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అదృశ్యం

  • మనీలాండరింగ్ కేసులో అనిల్ దేశ్ ముఖ్ కు ఈడీ సమన్లు
  • ఇప్పటికే రూ. 4.2 కోట్ల విలువైన ఆస్తుల జప్తు
  • అనిల్ కుమారుడు కూడా అదృశ్యం
మహారాష్ట్ర మాజీ హోంమంత్రి అనిల్ దేశ్ ముఖ్ అదృశ్యమయ్యారు. మనీలాండరింగ్ కేసులో ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తనను అరెస్ట్ చేసే అవకాశం ఉందనే భయాలతో ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆయన కోసం ఈడీ అధికారులు గాలిస్తున్నారు. అయితే ఆయన ఎక్కుడున్నారనే విషయం ఈడీ అధికారులకు ఇంతవరకు తెలియరాలేదు.

మరోవైపు ఆయన కుమారుడు రుషికేశ్ ఎక్కడున్నారో కూడా తెలియడం లేదు. ఈడీ నుంచి అనిల్ దేశ్ ముఖ్ కు ఇప్పటికే నాలుగు సార్లు సమన్లు జారీ అయ్యాయి. అనిల్ దేశ్ ముఖ్, అతని కుమారుడు సోమవారం విచారణకు హాజరుకావాల్సి ఉంది. ఈ విచారణకు వీరు గైర్హాజరయ్యారు. రూ. 100 కోట్ల అక్రమ వసూళ్ల అంశంలో దేశ్ ముఖ్ పై కేసు నమోదు చేశారు. నాగపూర్, ముంబైలలోని ఆయన ఆస్తులపై దాడులు కూడా చేశారు. రూ. 4.2 కోట్ల విలువైన ఆస్తులను జప్తు చేశారు. మరోవైపు దేశ్ ముఖ్ పీఎస్ సంజీవ్ పలాండె, పీఏ కుందన్ షిండేలను ఈడీ ఇప్పటికే అరెస్ట్ చేసింది.


More Telugu News